ప్రజ్ఞ వికాస పరీక్ష విజయవంతం : ఎస్‌ఎఫ్‌ఐ

ప్రజ్ఞ వికాస పరీక్ష విజయవంతం : ఎస్‌ఎఫ్‌ఐ

అనంతపురంలో ప్రజ్ఞ ప్రశ్న పత్రాలను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

నగరంలోని ఎస్‌వి జూనియర్‌ కళాశాలో శనివారం నిర్వహించిన ప్రజ్ఞ వికాస పరీక్ష విజయవంతమైనట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్‌ తెలిపారు. ముందుగా కళాశాల కరస్పాండెంట్‌ ఖాజావలితో కలిసి ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థులకు మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రశ్నపత్రాన్ని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు తయారు చేసినట్లు తెలిపారు. పబ్లిక్‌ పరీక్షలు అంటే భయం వీడాలనే ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా పదో తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల ఎదుగుదలకు సహాయపడుతుందనానరు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పి.దస్తగిరి, కె.మల్లికార్జునరావు, ఎం.వలిబాషా, ఎం.మౌనయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి శివ, ఉపాధ్యక్షులు సోము, నాయకులు భీమా, మాదేశ్‌, హరి, తదితరులు పాల్గొన్నారు ఉరవకొండ : ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ కరిబసవేశ్వర ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్ష విజయవంతంగా ముగిసింది. ముందుగా ప్రశ్నపత్రాలను యుటిఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రామప్పచౌదరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్‌, జిల్లా కమిటీ సభ్యులు, మారుతి, యుటిఎఫ్‌ నాయకులు, రఘు రాజశేఖర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షలు అంటే విద్యార్థుల్లో భయం పోగొట్టేందుకు ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రజ్ఞా వికాసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష పేపర్‌ను ప్రముఖ విద్యావేత్త కె.ఎస్‌ లక్ష్మణరావు తయారు చేస్తారన్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల స్థాయిలో మొదటి మూడు బహుమతులు, జిల్లాస్థాయిలో టాప్‌ 10 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల అధినేత సుబ్బారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శి హిరణ్య, నందు, నాయకులు గురుమూర్తి, మనోజ్‌, దేవకుమార్‌, యుటిఎఫ్‌ నాయకులు సంజీవ్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️