ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి

మాట్లాడుతున్న సిపిఎం మండల కన్వీనర్‌ మధుసూదన్‌

ప్రజాశక్తి-ఉరవకొండ

పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని సిపిఎం మండల కన్వీనర్‌, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో అర్హులైన పేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే ఆఘమేఘాలపై వచ్చి తొలగించే అధికారులు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఉంచిన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రూ.కోట్లు విలువజేసే ఆస్తులు కబ్జాకు గురవుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులతోపాటు ఆక్రమించిన వారిపైన క్రిమినల్‌ కేసులు పెట్టి స్థలాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️