మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి : శ్రావణిశ్రీ

మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి : శ్రావణిశ్రీ

సమావేశంలో మాట్లాడుతున్న బండారు శ్రావణిశ్రీ

ప్రజాశక్తి-నార్పల

‘మీ ఇంటి బిడ్డగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నా.. ఆశీర్వదించి చెలిపించండి..’ అంటూ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మండల పరిధిలోని బి.పప్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న, చిన్న కలహాలు, సమస్యలు ఉనా మనమంతా ఒక్కటే కుటుంబ సభ్యులం అన్నారు. ఐకమత్య బలంతో ఉంటే మనదే విజయం అన్నారు. మన విజయానికి జనసేనా పార్టీ బలం కూడా తోడవుందన్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు గిఫ్ట్‌గా ఇద్దామని పిలుపునిచ్చారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిద్దామన్నారు. అంతేగాకుండా టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రతి ఇంటికీ తెలియజేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానానాయుడు, టిడిపి జిల్లా సీనియర్‌ నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, ఆకుల ఆంజనేయులు, రంగారెడ్డి, జనసేన నాయకులు సాకే మురళీకృష్ణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️