రాయదుర్గం టిడిపి అభ్యర్థి నేనే : కాలవ

రాయదుర్గం టిడిపి అభ్యర్థి నేనే : కాలవ

మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం2

024 అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసేది నేనేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. డి.హీరేహాల్‌ మండలంలోని సిద్దాపురం తండా గ్రామానికి చెందిన పది కుటుంబాలు గురువారం వైసిపిని వీడి టిడిపి మండల కన్వీనర్‌ హనుమంత్‌రెడ్డి సారథ్యంలో పట్టణంలోని కాలవ నివాసంలో టిడిపిలో చేరారు. వీరికి కాలవ పసుపు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కాలవ మాట్లాడుతూ అనంతపురం పార్లమెంట్‌ స్థానానికి టిడిపి తరఫున పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారం అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదే శాల మేరకే టిడిపి తరఫున పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గం అభివృద్ధికై రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కాలవ పిలుపునిచ్చారు.

➡️