విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పనులు ప్రారంభం

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి

         ఆత్మకూరు : మండల పరిధిలోని గొరిదిండ్ల గ్రామంలో రూ.1.75కోట్లతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి బుధవారం భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్‌ కోతలు లేకుండా, విద్యుత్‌ లోడ్‌ తగ్గించే విధంగా సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 10 గ్రామాలకు ఒక సబ్‌ స్టేషన్‌ నిర్మించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని చెప్పారు. నియోజకవర్గంలో తాను ప్రతిపాదించిన విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిన్నింటినీ ప్రారంభిస్తే నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఇ గంగాధర, ఇన్‌ఛార్జి ఏడీ నాగేంద్ర, ఏఇ దాస్‌తో పాటు వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️