విధ్వంసం తప్ప.. అభివృద్ధి శూన్యం

విధ్వంసం తప్ప.. అభివృద్ధి శూన్యం

విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

రాష్ట్రంలో సిఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక విధ్వంసం తప్ప అధివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని మాజీమంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని 13వవార్డులో వైసిపికి చెందిన 30 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. నాలుగున్నరేళ్లలో తొమ్మిది సార్లు కరెంట్‌ ఛార్జీలను పెంచారన్నారు. వంటగ్యాస్‌ ధరలు మూడింతలు పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవని గుర్తు చేశారు. దుర్మార్గమైన జగన్‌ పాలనను రాష్ట్రం నుంచి తరిమి కొట్టి టిడిపి-జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు నాగరాజు, జనసేనా ఇన్‌ఛార్జి కరేగౌడ మంజునాథ, వార్డు ఇన్‌ఛార్జి నాగరాజునాయక్‌, కుమార్‌, ప్రహ్లాద, తమ్మన్న, మండల కన్వీనర్‌ హనుమంతు, వార్డు సభ్యులు ప్రశాంతి, మాజీసభ్యులు మహబూబ్‌బాషా, వెంకటేశులు, పురుషోత్తం, భారతి, తిప్పేస్వామి, శంకర్‌, వేణు, ఇనాయత్‌, వెంకటేశులు, ఎస్సీ సెల్‌ మల్లి, సత్తి, తదితరులు పాల్గొన్నారు.

➡️