వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటా : ఎంపి

వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటా : ఎంపి

మాట్లాడుతున్న ఎంపి తలారి రంగయ్య

కుందుర్పి : అధైర్యపడొద్దు అండగా నేను ఉన్నానని కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి, ఎంపి తలారి రంగయ్య వైసిపి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎంపి గురువారం పక్షవాతానికి గురైన కుందుర్పి గ్రామ సచివాలయ కన్వీనర్‌ మంగళ నాగరాజును, కరెంట్‌ సత్తి, ఈడిగ చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులను పరామర్వించారు. అనంతరం ‘ఆడుదాం ఆంధ్ర’లో భాగంగా ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను తిలకించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లక్ష్మినరసింహా, పంచాయతీ కార్యదర్శి మహబూబ్‌ బాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగన్న, జడ్పిటిసి రాధాస్వామి, సర్పంచులు మారుతీశ్వరి రామ్మూర్తి, గంగాధర, గౌని ప్రభాకర్‌, మసాల జగన్‌, ఎంపిటిసి గంగమ్మ, వైస్‌ ఎంపిపి భీమరెడ్డి, నాయకులు సత్యనారాయణశాస్త్రి, మందలపల్లి భీమప్ప, గోపాల్‌, నాగలక్ష్మి, రాము, పాల్గొన్నారు.

➡️