శభాష్‌ నరేష్‌

శభాష్‌ నరేష్‌

చెట్లకు ప్లాస్టిక్‌ బాటిళ్లను కడుతున్న బాలనాగి నరేష్‌

ప్రజాశక్తి-నార్పల

అసలే మండు వేసవి.. మనుషులకు కూడా నీరు చిక్కని పరిస్థితి. ఇక పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. పక్షుల దాహార్తిని గుర్తించిన నార్పల మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి పక్షుల దాహార్తి తీరుస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన యువరైతు బాలనాగి నరేష్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ తోటకు వెళ్లేటప్పుడు.. ఇతర పనులు చేస్తున్నప్పుడు పక్షులు నీటి కోసం పడుతున్న పాట్లను గమణించాడు. దీంతో చలించిన నరేష్‌ వినూత్నంగా ఆలోచించి పక్షుల దాహార్తి తీర్చాలని తలంచాడు. అనుకున్నదే తడువుగా ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి ఓ వైపు పూర్తిగా తీసివేసి దాన్ని మేకుల ద్వారా చెట్లకు అమర్చి నీరు పోయడం ప్రారంభించాడు. మండల కేంద్రంలోని క్రాసింగ్‌ నుంచి సమీపంలోని తోటల వరకూ పలు ప్రాంతాల్లో చెట్లకు ఇలా తయారు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను అమర్చి నీరు పోస్తున్నాడు. నరేష్‌ వినూత్నమైన ఆలోచనకు మండల వాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

➡️