18,598 మందికి జగన్నతోడు

Jan 11,2024 21:26

జగనన్నతోడు మెగా చెక్కును లబ్ధిదారులకు అందిస్తున్న కలెక్టర్‌ తదితరులు

అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో 8వ విడత జగన్న తోడు కింద 18,598 మందికి ప్రభుత్వం సాయం అందిందని కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి జగనన్న తోడు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్‌ పర్సన్‌ సిహెచ్‌. ప్రమీల, ఆర్టీసీ జోనల్‌ ఛైర్‌ పర్సన్‌ మంజుల, నగర పాలక సంస్థ మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌లు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి సాహిత్య, సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఉమాదేవి, జిల్లా మైనారిటీ ఛైర్మన్‌ సైఫుల్ల, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ ఫయాజ్‌, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఎల్డీఎం సత్యరాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద 18,598 మంది లబ్ధిదారులకు రూ.19.67 కోట్ల రుణాల పంపిణీ చేశామన్నారు. లబ్ధిదారులు ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకుసాగాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాడుతూ చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వత్తుల వారికి రోజు వారీ పెట్టుబడి ఖర్చుల కోసం ప్రభుత్వం వడ్డీలేని రుణాన్ని అందిస్తోందన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు.

➡️