6న బుక్కరాయసముద్రంకు గవర్నర్‌ రాక

గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెసి

బుక్కరాయసముద్రం : రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ బుక్కరాయసముద్రం మండల కేంద్రానికి జనవరి 6వ తేదీన రానున్నారు. గ్రామపంచాయతీలో నిర్వహించే వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొననున్నారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమం కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశారు. గవర్నర్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఒ ప్రభాకర్‌ రావు, తహశీల్దార్‌ హరికుమార్‌, ఎంపీడీవో తేజోష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️