డిమాండ్లను పరిష్కరించాల్సిందే…

Jan 11,2024 15:51 #Anantapuram District
anganwadi workers strike 31day in atp

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం కూడా కొనసాగుతుంది. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి మాట్లాడుతూ 31వ రోజు కూడా సమ్మె కొనసాగుతూనే ఉంది. సమ్మెలో అంగనవాడి టీచర్స్ హెల్పర్స్ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేనిపక్షంలో అనేక రూపాలలో సమ్మెను కొనసాగిస్తామని తెలియజేశారు. సిపిఎం మండల కార్యదర్శి సూరి ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు టి పెద్దయ్య, వ్యవసాయ కార్యదర్శులు మండల కార్యదర్శి బిభాస్కర్ రెడ్డి, కెవిపిఎస్ నాగభూషణ్ మండల పుట్లూరు, సిఐటి నాయకులు మహమ్మద్ బాషా ఓబులేసు, రామచంద్రారెడ్డి, అంగనవాడి మండల అధ్యక్షురాలు జయలలిత, రమాదేవి, శశికళ, అనంతలక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.

➡️