ఎలాంటి లోటుపాట్లు లేకుండా అబ్జర్వర్ల పర్యటనకు ఏర్పాట్లు

ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

       అనంతపురం : ఎన్నికల అబ్జర్వర్ల రాక దృష్ట్యా జాగ్రత్తగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాకు సాధారణ ఎన్నికల అబ్జర్వర్‌ల రాక నేపథ్యంలో గురువారం అనంతపురం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బి అతిథి గహంలో అవసరమైన మరమ్మతులు శాశ్వతంగా నిలిచేలా చేపట్టాలని, అతిథి గహాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అవసరమైన ఛైర్స్‌, టేబుల్స్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నియోజకవర్గానికి ఒక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేయాలని, అబ్జర్వర్లకు అవసరమైన రిపోర్టులను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అబ్జర్వర్ల కోసం ఏర్పాటుచేసిన అధికారుల టీంలు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘ స్వరూప్‌, ఆర్డీవో జి.వెంకటేష్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్‌ రెడ్డి, నోడల్‌ అధికారులు, లైజన్‌, ఆర్‌అండ్‌బి అధికారులు పాల్గొన్నారు.

➡️