వడదెబ్బకు గురైన బండారు శ్రావణిశ్రీ

వడదెబ్బకు గురైన బండారు శ్రావణిశ్రీ

చికిత్స చేయించుకుంటున్న బండారు శ్రావణిశ్రీ

శింగనమల : నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఆదివారం వడదెబ్బకు గురయ్యారు. ఎన్నికల నేపథ్యంలో విరామం లేకుండా ప్రచారంలో పాల్గొనడంతో వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఇంట్లోనే వైద్యసేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు, టిడిపి శ్రేణులు, అభిమానులు అనంతపురంలోని ఆమె స్వగృహానికి చేరుకుని పరామర్శిస్తున్నారు. త్వరగా కోలుకుని ప్రచారానికి రావాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

➡️