ప్రహరీ గోడ, పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ

Feb 14,2024 13:25 #Anantapuram District
Bhumi Pooja for construction of Prahari Wall, Pushkarini

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని కోటలో గల ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ ఆవరణలో నాలుగు కోట్ల 15 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ మరియు పుష్కరిణి నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. నామఫలకం ఆవిష్కరించారు. రెండు కోట్ల 65 లక్షల రూపాయలు తిరుపతి తిరుమల దేవస్థానం నిధులు మంజూరు చేయగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక కోటి20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. స్థానిక భక్తులు 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆలయం చుట్టూ ప్రహరీ కూడా మరియు పుష్కరిణి నిర్మిస్తామని ఆలయ పాలకమండలి అధ్యక్షులు గౌని పాలాక్షి రెడ్డి మరియు దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి అధ్యక్షులు పాలాక్షి రెడ్డి, కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా చైర్ పర్సన్ కాపు భారతి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు ఆర్ సత్యనారాయణ, ఉమాపతి, మై కాపా పట్టణ కన్వీనర్ శివప్ప, సుబ్రహ్మణ్యం, ఎస్ఎల్వి రాధాకృష్ణ, కాపు ప్రవీణ్ రెడ్డి, మున్సిపల్ వార్డు సభ్యులు గోవిందరాజులు, కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️