ఛేంజ్ ఫర్ సొసైటీకి భారత సేవారత్న పురస్కారం

Jan 26,2024 16:05 #Anantapuram District
change for society service award

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం జిల్లా ) : కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పలు సేవలు అందిస్తు, రక్తదానం, అన్నదానం, ఉచిత కంటి, గుండె వైద్య చికిత్సశిబిరాలు, నిరుపేద కుటుంబాలకు విద్య, వైద్య, నిత్యావసర సరుకుల పంపిణీ, నిరాశ్రయులకు అన్నదానం, క్షయ వ్యాదిగ్రస్తుల దత్తత, దివ్యాంగులకు సైకిళ్ల పంపిణీ ఇలా సుమారు 26 రకాలకు పైగా సేవలు అందించి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 150 సంస్థలతో పరిచయాలు పెంచుకొని ఈ ప్రాంతం వాసులు ఎక్కడ ఇబ్బంది అని అభ్యర్థించిన సాయం అందిస్తున్నందుకు గాను చేంజ్ ఫర్ సొసైటీకి భారత సేవరత్న పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు విజయవాడలోని తాసుబెల్లి ఫౌండేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ ఫౌండేషన్ ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో సేవలందిస్తున్న 500 స్వచ్ఛంద సేవలో వారి సేవలను గుర్తించి అందులో 130 సంస్థలకు భారత సేవ రత్న పురస్కారాన్ని ఇవ్వనున్నట్టు తెలిపింది.ఈ సందర్భంగా ఛేంజ్ ఫర్ సొసైటీ టీం సభ్యులు మాట్లాడుతూ ఈ సేవా పురస్కారం మరింత బాధ్యత తమకు పెంచిందని, రాబోయే రోజుల్లో మరిన్నో సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తామని, తమకు సహకారం అందిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల నాయకులు, సమాజానికి పరిచయం చేస్తున్న పత్రిక విలేకరులకు, దాతలకు ఈ పురస్కారం అంకితం అని తెలిపారు.

➡️