చిరస్మరణీయులు డా||బాబు జగ్జీవన్‌ రామ్‌

జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

       అనంతపురం కలెక్టరేట్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కషి చేసిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ చిరస్మరణీయులని కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలియజేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బాబు జగ్జీవన్‌రామ్‌ 117వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జడ్పీ సీఈఓ వైఖోమ్‌ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి తదితరులు హాజరై జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశానికి బాబు జగ్జీవన్‌ రామ్‌ మహోన్నతమైన సేవ చేశారని కొనియాడారు. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. నవభారత నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదన్నారు. జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ జెడి మధుసూదన్‌ రావు, బీసీ వెల్ఫేర్‌ డిడి కుష్బు కొఠారి, డిపిఒ ప్రభాకర్‌ రావు, డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️