రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదు

Mar 30,2024 13:00 #Anantapuram District

చౌక డీలర్లు, ఎండియు ఆపరేటర్లకు ఎన్నికల అధికారుల సూచన

ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం తహసిల్దార్ చిట్టిబాబు చౌక దుకాణపు డీలర్లు, ఎండియు ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. వీరు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్నికల నియమావళి అనుసరించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో డిప్యూటీ తహసిల్దార్ రఘు, రాయదుర్గం పట్టణం మరియు మండలంలోని చౌక దుకాణపు డీలర్లు, ఎండియూ ఆపరేటర్లు పాల్గొన్నారు.

➡️