ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం సిపిఎం నేతలు మాట్లాడుతూ … ఖరీఫ్‌ రబి పంటల బీమా ప్రకటించాలని కోరారు. కరువు నివారణకు ప్రత్యేక నిధులు ప్రకటించాలన్నారు. పెట్టుబడి సాయం కుటుంబ ఆధారం కాకుండా ఎకరాల ఆధారంగా కనీసం 10 ఎకరాల వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డ్రిప్పు స్పింకర్లు పై జిఎస్టి రద్దు చేసి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే జీవో నెంబర్‌ 22ను రద్దు చేయాలని కోరారు. వీటన్నిటిని వెంటనే పరిష్కరించాలని తహశీల్దార్‌ కార్యాలయంలో మల్లికార్జునస్వామి, ఏవో కాత్యాయనికి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు సూరి, రైతు సంఘం నాయకులు భాస్కర్‌ రెడ్డి, నాగేంద్ర, పెద్దయ్య, నాగభూషణం, కుల్లాయప్ప, రఘువీరా, రాజ కొల్లాయప్ప, తదితరులు పాల్గొన్నారు.

➡️