రక్తదానం చేయడం అభినందనీయం

రక్తదానం చేయడం అభినందనీయం

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ముస్లిం నాయకులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

బక్రీద్‌ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది స్వచ్చందంగా రక్తదానం నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్‌ వసీం అన్నారు. సోమవారం ఈద్గా మైదానం వద్ద స్వచ్చంద రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతపురం నగర ప్రజలు, ముస్లిం ప్రజానీకం 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా బక్రీద్‌ పండుగ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా మారిందన్నారు. మానవతా నేతత్వంలో నజీర్‌ మిత్ర బందం నిర్వాహకులుగా మతసామరస్యం మన నినాదం రక్తదానం మన విధానం అంటూ రక్తదానాన్నే బలిదానంగా ఆచరించడం, బలిదానాలకు త్యాగనిరతికి, నిజాయితీకి ప్రతీక బక్రీద్‌ పండుగ అన్నారు. మానవతా కులమతాలకతీతం, రక్తదానంతో సమాజ ఐక్యతను చాటడం హర్షనీయం. అన్నారు. 81 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు అనంత చంద్రారెడ్డి, మానవత కన్వీనర్‌ తరమెల అమరనాథరెడ్డి, ఏకేఎస్‌ ఫయాజ్‌, మానవత కో-కన్వీనర్‌ సలీమ్‌ మాలిక్‌, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️