హంస వాహనంపై ఊరేగిన నారసింహుడు

హంస వాహనంపై ఊరేగిన నారసింహుడు

స్వామివారిని ఊరేస్తున్న అర్చకులు, భక్తులు

వజ్రకరూరు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెన్నఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శుక్రవారం హంస వాహనంపై ఊరేగారు. ఇందులో భాగంగా వేకువజామున మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి మూలవిరాట్‌, ఉత్సవ మూర్తులకు, అర్చనలు, మంగళ హారతులను నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఆసీనులను చేసి ఊరేగించారు. హంస అంటే జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. హంసలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే.. నీళ్లను, పాలను వేరుచేసే స్వభావంతో ఇది ప్రత్యేకంగా నిలిస్తుంది. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి ప్రసాదించేందుకు స్వామి వారు హంస వాహనంపై కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఒ విజరుకుమార్‌, అర్చకులు ద్వారాకనాథ్‌, బాలాజీస్వామి, గుండురావు, ఉత్సవదాతలు, భక్తులు పాల్గొన్నారు.

➡️