మహిళ పోస్టుమార్టంపై వైద్యుల నిర్లక్ష్యం

మహిళ పోస్టుమార్టంపై వైద్యుల నిర్లక్ష్యం

ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు

ప్రజాశక్తి-గుంతకల్లు

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పాత గుంతకల్లులో నివాసం ఉంటున్న కృష్ణవేణి (26) కడుపునొప్పితో సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే మంగళవారం వరకూ పోస్టుమార్టం చేయలేదు. దీంతో వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న 2వ పట్టణ సీఐ గణేష్‌ సిబ్బందితో చేరుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని ఉంచి 24 గంటలు గడచినా వైద్యులు పోస్టుమార్టం చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన సీఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జయవర్ధన్‌రెడ్డితో సంప్రదించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో ఆందోళన విరమించారు.

➡️