చుక్క నీరు కూడా రావడం లేదు

May 20,2024 11:25 #Anantapuram District

ఉద్దీబావి చెను కాలనీలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించండి 

ఎంపీడీవో రాముడుకు వినతిపత్రం అందజేసిన కాలనీవాసులు 

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఉద్దీబావి చెను కాలనీలో గత కొద్ది రోజుల నుండి కుళాయిలకు నీరు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ సందులో ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదని దీంతో దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారిందని నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పలువురు కాలనీవాసులు ఎంపీడీవో రాముడు ఈ ఓ ఆర్ డి శైలజా రాణి కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సంబంధిత పంచాయతీ అధికారులతో తాను ఇప్పుడే మాట్లాడి సమస్య ఏమిటో కనుక్కొని కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేస్తానని ఎంపీడీవో కాలనీ వాసులకు తెలిపారు. గత నాలుగు ఐదు రోజుల నుండి కోటవీధి తో పాటు తదితర ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి నెలకొంది అని ఎంపీడీవో దృష్టికి పలువురు చేసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రామకృష్ణ రాధాకృష్ణ శ్రీనివాసులు గౌస్ తిమ్మయ్య పుల్లగూర శెట్టి, లోకేష్ లతోపాటు పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

➡️