మండుటెండలో ‘పన్నుల’ పాట్లు

Apr 10,2024 13:10 #Anantapuram District

కాసులు చెల్లిస్తామన్నా కార్పొరేషన్ లో ప్రజలకు వసతులు కరువు

ఏడాది ఆస్తి నీటి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ

ప్రజలు పన్ను భారం తీర్చుకునేందుకు కార్పొరేషన్కు పరుగులు

అయినా చేష్టలుడిగిన కార్పొరేషన్ అధికారులు

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆస్తి, నీటి, పన్నులు చెల్లింపులు చేయటానికి వస్తే మండే సూర్యుడు నుంచి ఉపశమనం కల్పించడానికి కాస్తైనా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టకపోవడం దారుణం. మున్సిపల్ కార్పొరేషన్ కు ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ అయిన అధికార యంత్రాంగం తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాగుతోంది. ఆస్తి పన్ను, నీటి పన్ను కొండల పేరుకుపోయిన వాటిని వసూలు చేసుకునే శక్తి సామర్ధ్యాలు ఎలాగో అధికారులకు లేదు. కనీసం ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి పన్ను బకాయిలు చెల్లిస్తావంటే మండువేసవిలో నడి నెత్తిన సూర్యుడు చురుమనిపిస్తుంటే కింద భూమి వేడి సెగలు చిమ్ముతుంటే నిలబడటానికి ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇవేవీ కార్పొరేషన్ అధికారులకు పట్టదు పన్నులు చెల్లించే రెవెన్యూ కౌంటర్ల వద్ద షామియానాలు వేయించటం కాసింత బుర్ర ఉన్న వాడు ఎవడైనా చేసే పని పని అయితే కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు సాంకేతిక పరిజ్ఞానం మాట అటు నుంచి కనీసం ఎక్కడ శ్యామ్యానా వేయాలి. నీడ పట్టున ఎండ పట్టున అన్న విషయము అర్థం కాకపోవడం గమనార్హం చెట్టు నీడ పుష్కలంగా ఉన్నచోట శ్యామ్యాన షామియానా భారీ ఎత్తున వేయించారు. అయితే రెవెన్యూ కౌంటర్ల దగ్గర మాత్రం షామియానా వేయించలే ఇదే మనీ ప్రశ్నిస్తే ఇంజనీరింగ్ అధికారులకు చెప్పమని వర్కర్ కు రెవెన్యూ అధికారి ఒకరు పురమాయించడం కనిపించింది. ఇలాంటి బడుధాలు ఉన్న కార్పొరేషన్ కు 55 కోట్లకు పైగా కొండల పేరుకుపోయిన మొండి బకాయిలు ఎలా వసూలు అవుతాయో ఆ ఉన్నతాధికారికే తెలియాలి. ఆయనేమో ఐఏఎస్ కానీ కూర్చున్నదేమో కమిషనర్ సీటు కానీ కమిషనర్ గా కన్నా ఐఏఎస్ అన్నా భ్రమలో కొనసాగుతూనే ఉన్నారు. అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టాలంటే ఐఏఎస్ అధికారి ఆ దేశ జాన్ని వదిలి కమిషన్ అన్న స్పృహతో వ్యవహరిస్తే అధికారులు గాడిన పడే అవకాశం ఉంది లేకుంటే జనం దృష్టిలో ఆ ఉన్నతాధికారి పలుచన కాక తప్పదన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అధికారులు కేవలం వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు ఏసీ గదులకే పరిమితం కాకుండా ఉండాల్సిన అగత్యం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

➡️