ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

ఖైదీలతో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న న్యాయమూర్తి శ్రీనివాసులు

ప్రజాశక్తి-గుత్తి

ఖైదీలు సత్ప్ర వర్తనతో మెలగాలని జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు సూచించారు. శనివారం పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని న్యాయ మూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జైలు వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కారాగారం పరిసరాలు, వంటగదిలో ఖైదీల కోసం తయారు చేసిన ఆహారం, స్టోర్‌ గది, మరుగుదొడ్లను పరిశీలించారు. తర్వాత సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని ఖైదీలను అడిగారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైన తర్వాత నేరాలకు పాల్పడకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ మహేశ్వరుడు, బార్‌ అసోసియేషన్‌ ఇన్‌ఛార్జి అధ్యక్షుడు పీడీ రత్నం, న్యాయవాదులు గంగాధర్‌ కుమార్‌, ఎ.సూర్యనారాయణ, షఫీవుల్లా, టైపిస్ట్‌ సాదిక్‌వలి, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.

➡️