‘కాలవ’కు ఐటి నిపుణుల ర్యాలీ

'కాలవ'కు ఐటి నిపుణుల ర్యాలీ

ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి ఐటి ఫోరమ్‌ నాయకులు

రాయదుర్గం : టిడిపి అభ్యర్ధి కాలవ శ్రీనివాసులుకు మద్దతుగా బెంగళూరు టిడిపి ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఐటీ నిపుణులు ఆదివారం రాయదుర్గంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని టిడిపి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్‌ విగ్రహం వరకూ సాగింది. అనంతరం పట్టణంలోని 21, 22, 23వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, జనసేన ఇన్‌ఛార్జి మంజునాథగౌడ, యువ నాయకులు కాలవ భరత్‌, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️