అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

డయల్‌-100 విభాగంలో మాట్లాడుతున్న ఎస్పీ గౌతమిశాలి

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

జెఎన్‌టియులోని స్ట్రాంగు రూంల భద్రత, డయల్‌ 100 విభాగం పోలీసుల పనితీరును ఎస్పీ గౌతమిశాలి అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్ట్రాంగు రూంల వద్ద మూడంచెల భద్రతను పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని ఈసర్వేలెన్స్‌ సెంటర్‌కు చేరుకుని డయల్‌-100 విభాగాన్ని తనిఖీ చేశారు. అర్ధరాత్రి వేళ పోలీసుల సహాయం కోసం ప్రజలు, బాధితుల నుండీ వచ్చే ఫోన్‌ కాల్స్‌కు ఎలా స్పందించి సంబంధిత పోలీసులను ఘటనా స్థలాలకు ఎలా పురమాయిస్తున్నారో సమీక్షించారు. ఈ తనిఖీల్లో జెఎన్‌టియు స్ట్రాంగు రూంల వద్ద భద్రతా విధుల్లో ఉన్న సాయుధ పోలీసులు, డయల్‌-100 విభాగం పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు తేలింది. మరింత అప్రమత్తంగా ఉండాలని, చిత్తశుద్ధి, అంకితభావంతో విధులు చేపట్టి ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పని చేయాలని సూచించారు

➡️