సిఎం జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

సిఎం జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

ఎన్నికల ప్రచారంలో నమస్కరిస్తున్న వై.విశ్వేశ్వర్‌రెడ్డి

ప్రజాశక్తి-బెలుగుప్ప

సిఎం జగన్‌తోనే అన్నివిధాలా రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని దుద్దేకుంట, అంకంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఒక్క దుద్దేకుంట ఎస్సీ కాలనీలోనే 180 ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. అలాగే రూ.17కోట్ల సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఇవి జీర్ణించుకోలేని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఆయన మాటలను నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, సిఎంగా జగన్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వీరన్న, పెద్దన్న, త్రిలోకనాథ్‌రెడ్డి, రామాంజనేయులు, రత్నమ్మ, రుద్ర, బి.శివలింగప్ప, పి.నాగిరెడ్డి, హనుమంతురాయుడు, దేవనాథ్‌రెడ్డి, బ్రహ్మానంద, లక్ష్మన్న, దేవనాథ్‌రెడ్డి, అనిల్‌, ఎర్రిస్వామి, తదితరులు పాల్గొన్నారు.వజ్రకరూరు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపికి ఓట్లు వేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి సతీమణి భువనేశ్వరి అన్నారు. శనివారం ఉరవకొండలోని 10వ వార్డు, రంగా స్ట్రీట్‌లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేను చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా విభాగం నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️