వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి

వైసిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శంకరనారాయణ, వీరాంజనేయులకు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-శింగనమల

వైసిపి ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, కల్లుమడి, తరిమెల గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కల్లుమడి గ్రామంలో గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో వైసిపికి ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారన్నారు. అందుకు తగ్గట్టుగానే సిఎం జగన్‌ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందజేశారన్నారు. దీంతో పేద కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్లు కరోనా మింగేసినా, ఉన్న మూడేళ్లలోనూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఇకపోతే కూటమి మేనిఫెస్టో బూటకమేనన్నారు. నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ఐదేళ్లలో ప్రజలకు కనిపించని టిడిపి అభ్యర్థి ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రజల్లో వచ్చారన్నారు. అలాంటి వారు కూడా వైసిపిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటమి భయంతోనే ‘కూటమి’ నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రజలు టిడిపి వాగ్దానాలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయమని ధీమా వ్యకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎడిసిసి బ్యాంకు మాజీ ఛైర్మన్‌ తరిమెల కోనారెడ్డి, తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, కంచెరెడ్డి భాస్కర్‌రెడ్డి, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ బొమ్మన శ్రీరామిరెడ్డి, నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, నరసింహారెడ్డి, బొమ్మన భాస్కర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️