పేదలకు ఉచిత వైద్యం అందించడం కోసమే

Apr 8,2024 10:42 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల : పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికే యోగ చికిత్సలయం నిర్మాణం చేపట్టనున్నట్లు సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకులు భిక్షమయ్య గురూజీ తెలిపారు. మండల కేంద్రమైన నార్పలలోని సత్యసాయి యోగవిద్యాలయం అనాధ శరణాలయం సమీపంలో నిర్మించతలపెట్టిన ఆవరణంలో ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం, ఉగాది పురస్కారాలు పంపిణీ కార్యక్రమ సత్యసాయి ధ్యాన మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సత్సంగ సమావేశంలో భిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ మనిషి మానసిక మట్టంలో పుట్టే ఆలోచనలతోనే రోగాలు వస్తున్నాయని మనిషి అంతరంగం మార్చుకుంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటా రన్నారు. అందరూ భగవంతుని స్వరూపులేనని వారు ఆలోచన విధానాల వల్లే రుగ్మతల బారిన పడుతున్నారన్నారు. మనిషిలో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. తాను యోగ ద్వారా తనకున్న రకరకాల జబ్బుల బారి నుంచి 2015లో బటపడ్డనన్నారు. 2018లో నాఆలోచన విధానంలో మార్పు వచ్చిందన్నారు. 2021నుంచి నేను చేపట్టిన సంకల్పలు సునాయాసంగా నెరవేరాయా న్నారు. దీని ఫలితమే యోగ చికిత్సాలయం ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. తపైన ప్రయోగ పూర్వకంగా చేసిన విధానాలే రేపటి యోగా చికిత్సాలయాలు లో గురువులను తయారు చేయడానికి సంకల్పించినట్లు గురూజీ తెలిపారు. మొదటి యోగ చికిత్సాలయం మహానందిలో గత ఏడాది ప్రాంభించి ఐదు శిబిరాలలో చాలా మంచి ఫలితాలు సాధించడం వల్ల నార్పలలో యోగ చికిత్సాలయం నిర్మాణం చేపట్టామని, 2013లోనే గవ్వల శివ ఒక ఎకరా స్థలం దానం ఇవ్వడం వల్ల ఇక్కడ గవ్వల చిన్న మల్లేసు మెమోరియల్ యోగ చికిత్సాలయం నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ చేపట్టామన్నారు. నా వంతుగా ఒక లక్ష రూపాయలు అందజేస్తున్ననని అక్కడికక్కడే చెక్కు అందజేశారు. తన కొడుకులతో కూడా 2లక్షలు యోగచికిత్సాలయం నిర్మాణంకు విరాళం ఇప్పిస్తనని హామీఇచ్చారు. దీనికి విశిష్ఠ అతిథులుగా హాజరైన చిన్మయస్వామి, సబ్ రిజిస్టర్ మూర్తి, అభయ ఫౌండేషన్ బాలచందర్ ,ఉదయ భాస్కర్ మాట్లాడుతూ భిక్షమయ్య గురూజీ చేపట్టిన యోగచికిత్సలయం విశిష్టత గురించి కొనియాడారు. దాతలు సహకారం అందించాలన్నారు.అనంతరం స్థల దాత శివ కుటుంబ సభ్యులకు ఉగాది పురస్కారం అందజేశారు. అదేవిధంగా దివంగత డాక్టర్ శ్రీనివాసరెడ్డి కి వైద్య రత్న బిరుదుతో సత్కరించారు. ఆయన కుమారుడుచిన్నపిల్లల వైద్యలు శ్రీకాంత్ రెడ్డికి అందజేశారు. ఆయన భిక్షమయ్య గురూజీ తలపెట్టి యోగ చికిత్స ఆలయంకు రూ 25 వేలు విరాళం అందజేస్తనన్నారు. అనంతపురంకుచెందిన విజయేశ్వరి మాత భక్తురాలు అర్వేటి శారద 1లక్షరూపాయలు విరాళం ప్రకటించారు. అనంతరం సామాజిక రత్న అంకె రామలింగయ్య, గానరత్న దీప్తి చరన్, సేవరత్న బిరుదు తిక్కయ్య స్వామి నిర్వాహకులు దివంగత ఓట్ల చిన్న శేషయ్య సతీమణికి రత్నమ్మకు, వివిధ విభాగాలలో ప్రతిభావంతులకు సత్యసాయి ధ్యాన మండలి ట్రస్ట్ ద్వారా బిరుదులతో పాటు శాలువా సత్కారం జ్ఞాపికలను భిక్షమయ గురూజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ధ్యానమండలి సభ్యులు, శివ మిత్రబృందం పాల్గొన్నారు.

➡️