ఖాళీ కంచాలతో అంగన్వాడీల నిరసన

Dec 26,2023 14:31 #anakapalli

 ప్రజాశక్తి -బుచ్చయ్యపేట(అనకాపల్లి) : గత 15 రోజుల నుండి సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు మంగళవారం బుచ్చయ్యపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ఆకలి తీర్చండి అంటూ ఖాళీ కంచాలు,ఖాళీ బాక్స్ లతో శబ్దాలు చేస్తూ నినాదాలు చేశారు.తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటి, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రతినిధుల ఆది వరలక్ష్మి, ఎలిశెట్టి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️