తాళ్లతో చేతులు కట్టుకొని అంగన్‌వాడీల నిరసన

Jan 10,2024 00:44

ప్రజాశక్తి – బాపట్ల :  అంగన్‌వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని నిరసిస్తూ స్థానిక అంగన్‌వాడీల సమ్మె శిబిరం వద్ద తాళ్లతో చేతులు కట్టుకొని నిరసన తెలిపారు. అంగన్‌వాడీలు చేపట్టిన 24గంటల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. దీక్షలో ఎ బ్యూలా, ఎం సులోచన, పి లత, పి రమాదేవి కూర్చున్నారు. అంగన్‌వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు శైలశ్రీ మాట్లాడుతూ అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మె నెలరోజులైనా పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం దుర్మార్గం అన్నారు. ఉద్యమాన్ని అణచాలనుకుంటే నారీమణుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్, భోగిరెడ్డి తిరుమలరెడ్డి, సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, కె నాగేశ్వరరావు, శరత్, సామేలు మద్దతు ప్రకటించారు. సమ్మెలో సీతామహాలక్ష్మి, గీత, హేమమాలిని, శ్రీలత పాల్గొన్నారు.


అద్దంకి : అంగన్‌వాడి కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించి సమ్మె అణచివేసే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, కెఎల్‌డి ప్రసాదు, తన్నీరు సింగరకొండ, పి తిరుపతిరెడ్డి, సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

సంతమాగులూరు : అంగన్‌వాడిల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె, దీక్షలు స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద కొనసాగించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మస్తాన్ బి, శ్రీదేవి, మల్లేశ్వరి, ఎస్తేరా రాణి, నిర్మల, ఆదెమ్మ, రమణ పాల్గొన్నారు.


కొల్లూరు : అంగన్‌వాడీలు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని చేతులు పైకెత్తి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు టి కృష్ణమోహన్, సిఐటియు మండల నాయకులు బి అగస్టీన్, బి సుబ్బారావు, అంగన్వాడి లీడర్స్ సౌభాగ్య, లక్ష్మి, భాగ్యం, కాశి, ఆదిలక్ష్మి, నగరాజకుమారి పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : ఎన్నికల కు ముందు జగన్ మోహన్ రెడ్డి అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలను అణచివేయడానికి ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తే సమ్మె మరింత ఉదృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎనికపాటి రాంబాబు, సెక్టార్ యూనియన్ నాయకులు తాళ్లూరి రాణి, పల్లెపోగు శ్యామల, నాగ పుష్పరాణి, కుసుమ, జ్యోతి, రాజేశ్వరి, అంకమ్మ పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా శ్రీ విగ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు కన్నెగంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 150మందికి ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.


అమృతలూరు : అంగన్‌వాడీలకు నోటిస్ లొద్దు, గీటిస్ లొద్దు వేతనాలు పెంచాలంటూ నినదిస్తూ చేయి చేయి కలిపి ఐక్యంగా పోరాడదామని ర్యాలి చేశారు. కార్యక్రమంలో రత్న కుమారి, ఎస్ సుజాత, ఎం లలిత కుమారి, ప్రసన్న, రాణి పాల్గొన్నారు.


రేపల్లె : అంగన్‌వాడీ యూనియన్ నాయకులు డీ జయప్రద, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల కక్షధోరణి మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవి లక్ష్మణరావు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు బేబీరాణి, రజిని, నాగమణి, సుజాత పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడిలు స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.


వేమూరు : అంగన్‌వాడీలు సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు బునిగల ఆగస్టీన్ పాల్గొన్నారు.


బాపట్ల రూరల్ : అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జెవివి రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వరరెడ్డి కోరారు. అంగన్‌వాడీలపై ఎస్మా అప్రజాస్వామికమని అన్నారు. నిరాహారదీక్షలొ టి రమాదేవి, పి లత, ఎం సులోచన, బ్యూల, శైలజ, వసంత, సీతామాలక్ష్మి, గీత, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందార్, బిటి రెడ్డి, శరత్ పాల్గొన్నారు.


చెరుకుపల్లి : అంగన్‌వాడీ కార్యకర్తలు ఖోఖో ఆడి నిరసన తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు.


ఇంకొల్లు రూరల్‌ : అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు. దీంతో ఉధ్రిక్త వాతావరణం నెలకొంది. అంగన్‌వాడీల నిరసన దీక్ష విరమించాలని పోలీసులు కోరారు. అంగన్‌వాడీల దీక్షలకు సిపిఎం, టిడిపి, జనసేన పార్టీలతో పాటు సిఐటియు మద్దతు ప్రకటించింది. దీక్ష విరమించక పోవటంతో అంగన్‌వాడీలతో పాటు వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేశారు. ప్రభుత్వ తీరును సిఐటియు కార్యదర్శి నాగండ్ల వెంకట్రావు ఖండించారు.


కారంచేడు : అంగన్‌వాడిలు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. సిఐటియు నాయకులు పి కొండయ్య, అంగన్వాడి నాయకులు శ్రీలక్ష్మి, క్రీస్తు రాజ్యం, కళ్యాణి, హఫీజ, శివలీల, ఆదిలక్ష్మి, రాధా పాల్గొన్నారు.


చీరాల : అంగన్‌వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం దుర్మార్గమని సిఐటియు కార్యదర్శి ఎం వసంతరావు అన్నారు. తహశీల్దారు కార్యాలయం ధర్నా చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ నాయకురాలు పి ప్రమీల, జి సుజీవన, శిరీష, బుల్లెమ్మాయి, భూలక్ష్మి పాల్గొన్నారు.


పర్చూరు : అంగనవాడీ కార్యకర్తలు స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, ఎం డేవిడ్, బీ చినదాసు, చింతగుంట శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️