ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాజంపేట నియోజకవర్గం అభివద్ధి చెందాలంటే ఇండియా వేదిక బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి బుక్కే విశ్వ నాథ నాయక్‌ను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి థియేటర్‌ వరకు వామపక్ష నాయకులు ర్యాలీగా వెళ్లి బొక్కే విశ్వనాథ్‌ నాయక్‌ నామినేషన్‌ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్న బిజెపి, వైసిపి పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇనేళ్ల పాలకులు రాజంపేటకు ఏం అభివద్ధి చేశారో చెప్పాలని, ఎక్కడైనా ఒక పరిశ్రమ అయినా పెట్టారా.., ఏ ఒక్కరికైనా ఉపాధి అవకాశాలు చూపించారా అని ప్రశ్నించారు. రైతులకు అవసరమయ్యే గిడ్డం గులు కట్టించారా, యువతకు నైపుణ్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారా, విదేశాలకు వెళ్లే యువతను వెళ్లకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏమన్నా కల్పించారా అని పేర్కొన్నారు. నంద లూరు ప్రాంతంలో మూసివేసిన ఆల్విన్‌ పరిశ్రమ తెరిపించారా అని ప్రశ్నించారు. రాజంపేటకు వచ్చినటువంటి వైద్య కళాశాలను సైతం మరొక ప్రాంతానికి తరలించుకుపోతే పాలకులు కళ్ళు మూసుకొని చూస్తూ చేతులు ముడుచుకున్నారు తప్ప అడ్డుకున్న పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో జగన్‌ పాలనలో అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ లను విస్మరించారని, మోడీతో జతకట్టి రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.ఎల్‌.నారాయణ, జిల్లా కార్యదర్శి పి.ఎల్‌ నరసింహులు, సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌, చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.రాధాకృష్ణ, ఎం.శివరామకృష్ణ దేవరా, సాంబశివ, సిద్దిగల శ్రీనివాసులు, మురళి, సుధీర్‌, తోపు కృష్టప్ప, మనోహర్‌ రెడ్డి, జ్యోతి చిన్నయ్య, మహిళ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సుమిత్రమ్మ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటే శ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండు గోల మణి, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎమ్మెస్‌ రాయుడు, సిపిఎం నాయకులు నరసయ్య, సురేష్‌, రమణ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాలి చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, వేణుగోపాల్‌రెడ్డి, అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️