ఎపి మోడల్ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం 

Mar 3,2024 14:38 #High Schools, #Kurnool

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : ఆంధ్రప్రదేశ్ లోని ఏపీ మోడల్( ఆదర్శ) పాఠశాలలలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు గోనెగండ్ల ఏపీ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ షాహినా పర్వీన్ తెలిపారు.ఆదివారం ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ తాము కూడా మండలంలో విద్యార్థుల నుంచి ఏపీ మోడల్ పాఠశాల గోనెగండ్లలో ఆరవ తరగతిలో2024-25 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.ఈనెల అనగా మార్చి 3వ తేదీ నుంచి 31వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.నేరుగా మోడల్ పాఠశాలకు వచ్చి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.దరఖాస్తులకు ఓసి,బీసీలు 150 రూపాయలు ఎస్సీ ఎస్టీలు 75 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుందని అన్నారు.ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను పాఠశాలల్లో సమర్పించాలని తెలిపారు.దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ప్రతిభ ఆధారంగా మరియు రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి సీట్లు కేటాయించనున్నట్లు ఆమె తెలిపారు.

➡️