అరెస్టా? మళ్లీ బెయిలా?

Jun 19,2024 23:00

ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టి బయటకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గమైన రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు వద్ద పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ గడువు గురువారంతో ముగియనుంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోనే ఉంటూ ప్రతిరోజూ ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టాలనే షరతులతో ఆయన బుధవారమూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేశారు. నేటితో బెయిల్‌ ముగుస్తున్నందున ఆయనకు మళ్లీ బెయిల్‌ వస్తుందా? లేదా? అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

➡️