ప్రకృతి వ్యవసాయ కార్మికులకు బకాయి ఉన్న 14 నెలలు వేతనాలు ఇవ్వాలి

Mar 27,2024 17:34 #Chittoor District

జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కు వినతి

ప్రజాశక్తి – చిత్తూరు :   జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి అనుబంధంగా పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్మికులకు 14 నెలలుగా బకాయి ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని బుధవారం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసుకి కార్మికులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకులు భారతి, ప్రతాప్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజులు మాట్లాడుతూ 14 నెలలుగా జీతాలు రాకపోవడంతో మా కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులను చైతన్యవంతం చేయడానికి వెళ్లడానికి కూడా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని పెట్రోల్ కూడా అప్పు చేసుకుని వెళ్తున్నామని తెలిపారు. కుటుంబ జీవనం సాగించడానికి కష్టంగా ఉందని ఇంటిదగ్గర రకరకాల వత్తులు వచ్చిన రైతుల కోసం సేవా దృక్పథంతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ 14 నెలలు వేతనాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధను తెలియజేసి వెంటనే జీతాలు వచ్చే విధంగా చేయాలని కోరారు. పండగల సమయంలోనైనా అడ్వాన్సులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ జిల్లాలో అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై డిపిఎం స్పందిస్తూ మీరు చెప్పిన విధంగా వేతనాలు ఆలస్యం అవుతున్నది వాస్తవమైనప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇచ్చిన వినతి పత్రాన్ని వెంటనే ప్రభుత్వానికి మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. కార్మికులందరూ డిపిఎం కి ధన్యవాదాలు తెలియజేశారు.

➡️