అట్టహాసంగా ఎంపిఎల్‌ -2 ప్రారంభం

May 17,2024 23:16 #ఎంపిఎల్‌ -2
ఎంపిఎల్‌ -2

ప్రజాశక్తి- పిఎం పాలెం: యువత చెడు మార్గంలో వెళ్లకుండా సామాజిక స్పృహ, స్నేహభావాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు దోహదపడతాయనిని ఎబి.గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎంఎస్‌ స్వరూప్‌, వేదాంత హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ శివ అన్నారు.శుక్రవారం పిఎం పాలెం క్రికెట్‌ స్టేడియం ఎంపిఎల్‌ సీజన్‌-2 క్రికెట్‌ పోటీలను మ్యాచ్‌ అంపైర్స్‌, పర్యవేక్షణ, ఎంపిఎల్‌.అధ్యక్షులు వాండ్రాసి రవి, ఆదిత్యవర్మ, నక్కా శ్రీధర్‌, సేకరి శ్రీనివాస్‌, పోతిన అప్పలరాజు, నాగోతి సత్యనారాయణ, గరే గురునాథ్‌, కోర్రాయి సురేష్‌లతో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు.మధురవాడ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో, మధురవాడ యువత, బైపిల్లి ప్రసాద్‌ పర్యవేక్షణలో వారం రోజులపాటు నిర్వహించే ఎబి గ్రూప్‌ ఎంపిఎల్‌. సీజన్‌-2 పోటీల్లో 5,6,7,8 వార్డుల నుండి సుమారు 8క్రికెట్‌ జట్లు తలపడనున్నాయి. టోర్నీకిసంబంధించి ట్రోఫీని, క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో మధురవాడ రాక్‌ స్టార్స్‌, కొమ్మాది లయన్స్‌, బొట్టవానిపాలెం బుల్స్‌, చంద్రంపాలెం టైగర్స్‌, బక్కన్నపాలెం రాయల్‌ స్ట్రైకర్స్‌, పిఎం.పాలెం సూపర్‌ కింగ్స్‌, పరదేశిపాలెం క్రికెట్‌ ఆర్మీ, ఎండాడ హెచ్‌సిఎ.-11 జట్లు తలపడనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు డాక్టర్‌ ఎంఎస్‌ స్వరూప్‌, డాక్టర్‌ శివ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తే మంచిపేరుతోపాటు బంగారు భవిష్యత్‌ ఉంటుందని,యువత క్రీడాస్ఫూరితో మెలగాలని పిలుపునిచ్చారు. ఎంపిఎల్‌ సీజన్‌ -2నిర్వాహకులను అభినందించారు కార్యక్రమంలో జగ్గుపిల్లి నరేష్‌, మామిడి దుర్గారావు పసుపులేటి రామచలం, క్రీడాకారులు పాల్గొన్నారు

ట్రోఫీని, క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరిస్తున్న అతిథులు, నిర్వాహకులు

➡️