విద్యార్థులకు యోగా పై అవగాహన

May 23,2024 14:36 #Kakinada

ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో గురువారం విద్యార్థులకు యోగా పై అవగాహన కల్పించారు.యోగ పై శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు టి సుబ్బారావు మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులు యోగాభ్యాసం చేయటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు, ఆర్‌.వెంకటేశ్వరరావు, గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజులు స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో శిక్షణ ఇచ్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా పంపించిన నీతి పద్యాలు చదవడం, బాలలతో పాడించడంలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సింగం బుల్లయ్య, పాఠకులు కాటమరాజు, వై.రాజేష్‌, బి.అరవింద కుమార్‌, కే.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️