బాబోయ్‌.. కుక్కలు

May 18,2024 20:42

 ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని మేజర్‌ పంచాయతీతోపాటు పలు గ్రామాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. దీంతో చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుపాం మేజర్‌ పంచాయతీలో కుక్కల సంచారం ఎక్కువైంది. వీధుల్లో గుంపులుగా తిరుగుతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే హడలెత్తి పోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు, పాదచారులు, వాకింగ్‌కి వెళ్లినటువంటి వారికి కుక్కలు వెంబడించడంతో ప్రమాదాలు, కుక్కకాటుకు గురైన సందర్భాలు ఉన్నాయి. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

➡️