జిల్లా స్థాయి క్రికెట్‌ విజేత యువ 11 టీం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని మంగమూరులో మే 23 నుంచి జూన్‌ 17 వరకు జరిగిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో ప్రథమ బహుమతిని ఒంగోలుకు చెందిన యువ 11 టీం గెలుచుకుంది. మంగళవారం మంగమూరులో జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల విజేతలకు దాతలైన ప్రభుత్వ టీచర్‌ కంకణాల క్రాంతి కుమార్‌ బ్యాంకు ఉద్యోగి కే కిరణ్‌ కుమార్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ గడ్డం రాజేష్‌, గ్రామ వాస్తవ్యులు ఎస్‌కె ప్రమోద్‌ బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు కసుకుర్తి శివ, బి వెంకటేశ్వరరావు, జి నాని, కే మారుతి పర్యవేక్షించారు. జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీల్లో ప్రథమ బహుమతిని ఒంగోలుకు చెందిన యువ11 టీం గెలుచుకోగా ద్వితీయ బహుమతి ని మంగమూరు టీం, తృతీయ బహుమతిని ఆర్‌ పురం టీము, చతుర్థ బహుమతిని మల్ల వరం టీం, ఐదవ బహుమతిని మద్దిపాడు టీం గెల్చుకున్నాయి. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఒంగోలు కు చెందిన వినుకొండ వెంకటేశ్వర్లు, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌గా దశరథ రామిరెడ్డి, బెస్ట్‌ బౌలింగ్‌ కొత్తపట్నం బాలాజీ ఎంపికయ్యారు. విజేతలకు వైసిపి మండల కన్వీనర్‌ దుంపా చెంచిరెడ్డి, యువనేత దుంపా ఇంద్రసేనారెడ్డిలు ప్రథమ బహుమతి కింద రూ.20,000 అందించారు. ద్వితీయ బహుమతిని మంగమూరుకు చెందిన కంకణాల సురేష్‌ రూ.15,000 అందించారు. తృతీయ బహుమతిని మంగమూరుకు చెందిన కొల్లిపర శర్మ అందించారు. నాలుగో బహుమతిని ఉద్యోగులు కంకణాల క్రాంతి కుమార్‌, కాకుమాను కిరణ్‌ కుమార్‌లు ఐదువేల రూపాయలను అందించారు. ఐదవ బహుమతిని వీఆర్వో కసుకుర్తి హనుమంతరావు రూ.3,000 అందించారు. గ్రామానికి చెందిన బత్తుల రాజశేఖర్‌రెడ్డి షీల్డ్డులను, మంగమూరు వాస్తవ్యులు గడ్డం రాజేష్‌, ఎస్‌కె ప్రమోద్‌ ఉలిచి రాజేష్‌, పెయ్యల తిరుపతి స్వామిలు, కన్సొలేషన్‌ బహుమతులను అందించారు.

➡️