16న జిల్లాకు బాబు, పవన్‌ రాక

Apr 12,2024 21:39

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బహిరంగసభ ఈనెల 16న విజయనగరంలో జరుగుతుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం పార్టీ కార్యాలయం అశోక్‌బంగ్లాలో పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌ గజపతిరాజు, నియోజకవర్గ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి ఆధ్వర్యాన నాయకులంతా సమావేశమయ్యారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు బాలాజీ జంక్షన్‌లో జరిగే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, అధికారుల నుంచి అనుమతులు గురించి చర్చించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి అదితి విజయలక్ష్మి గజపతి రాజు బాలాజీ జంక్షన్‌ ప్రాంతాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి గంటా పోలినాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పిల్లా విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️