మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సబ్బవరంలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి -అనకాపల్లి

మాదకద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఫోర్స్మెంట్‌ సూపరింటెండెంట్‌ కేజే సింహా చౌదరి, అసిస్టెంట్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సూపర్‌ ఇంటెండెంట్‌ డి శైలజ రాణి పేర్కొన్నారు. జూన్‌ 26 వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీకన్య జూనియర్‌ కళాశాలలో గురువారం యాంటీ డ్రగ్‌ క్యాంపెయిన్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సింహా చౌదరి, డి.శైలజ రాణి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమకు తెలిసిన సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్‌ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ ఇన్స్పెక్టర్‌ డి.అనిల్‌ కుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ జి.శ్రీనివాసరావు, ఎన్ఫోర్స్మెంట్‌ కానిస్టేబుల్స్‌ నాయుడు, వెంకటేష్‌, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.మాదక ద్రవ్యాల అనర్థాలపై అవగాహన సదస్సు సబ్బవరం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాదకద్రవ్యాల అనర్థాలపై విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి సత్ప్రవర్తనతో చదువులపై దృష్టి సారించాలన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️