ఐదేళ్ల వైసీపీ అవినీతి పాలన తరిమికొడదాం : ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు

May 3,2024 14:01 #aalamuru, #Rally, #TDP

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఐదేళ్ల అవినీతి పాలన సాగించిన వైసీపీని ప్రజలు ఎన్నికల్లో తరిమికొట్టాలని కొత్తపేట ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, నియోజవర్గ జనసేన అధ్యక్షుడు బండారు శ్రీనివాసు పిలుపునిచ్చారు. మండలంలోని మడికి, మూలస్థానం, జన్నాడ గ్రామాల్లో టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి వారు శుక్రవారం విస్తఅతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని బండారు సోదరులు అభ్యర్థించారు. తనతో పాటుగా ఎంపీగా గంటి హరీష్‌ మాధుర్‌ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులతో పాటు ఉమ్మడి పార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️