టిడిపితోనే బీసీ సంక్షేమం

Jan 17,2024 23:36

ప్రజాశక్తి – బాపట్ల
టిడిపితోనే బీసీలకు సంక్షేమమని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. జయహో బీసీ కార్యక్రమాన్ని పట్టణ బీసీ నాయకులతో కలసి స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఒక అవకాశం ఇవ్వమని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేసి బిసిలకు ఉపాధి అవకాశాలు, అభివృద్ధి లేకుండా చేశారన్నారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి బీసీలకు రక్షణ చట్టం తెచ్చి టిడిపి అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కలలను నెరవేరస్తూ ప్రతి విద్యార్థికి రు.10లక్షలు ఆర్థిక సహాయం చేశామని అన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికీ 90శాతం సబ్సిడీతో పనిముట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు.

➡️