చెరువులో చేపల కోసం వెళ్ళి వ్యక్తి మృతి

May 27,2024 16:10 #Bapatla District

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ : చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇంకొల్లు మండలంలోని కొణికి శివారు నలతోటివారిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గంగవరం గ్రామానికి చెందిన యాడికిరి సుబ్రహ్మణ్యం (50) చేపలు పట్టేందుకు కొణికి గ్రామ శివారు నలతోటివారిపాలెం చెరువులోకి దిగాడు. ఇంట్లో చెప్పకుండా ఆదివారం సాయంత్రం వెళ్ళి పోయాడు. రాత్రి అయినప్పటికి ఇంటికి చేరలేదు. తెల్లవారే సరికి చెరువులో శవమై కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇంకొల్లు ఎస్సై మల్లి ఖార్జునరావు సంఘటనా స్ధలానికి చేరుకొని పరిశీలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఇంకొల్లు ఎస్సై మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️