హైదరాబాద్‌లో బాపట్ల ఓటర్ల ఆత్మీయ సమావేశం

Mar 11,2024 00:11

ప్రజాశక్తి – బాపట్ల
భాగ్యనగరంలో ఆంధ్ర ఓటర్లతో బాపట్ల నియోజకవర్గం టిడిపి, జనసేన ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించినట్లు ఇక్కడి టిడిపి వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మియాపూర్ విశ్వనాధ్ గార్డెన్స్‌లో హైదరాబాద్‌లో నివసిస్తున్న బాపట్ల వాసులను ఒక వేదికపై చేర్చి నరేంద్ర వర్మ ఆత్మీయంగా పలకరించారు. 15వందల మంది పాల్గొన్న సమావేశంలో నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఓటు అనే ఆయుధంతో వైసిపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని అన్నారు. బాపట్ల భవిష్యత్తు కోసం టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిడిపికి ఓటేసి బాపట్ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అవినీతి రహిత పాలన చేస్తానని అన్నారు. జనసేన కో ఆర్డినేటర్ నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ బాపట్లలో వైసిపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో రాధాకృష్ణంరాజు, బాపట్ల ప్రాంతానికి చెందిన హైదరాబాద్ వాసులు పాల్గొన్నారు.

➡️