ప్రభుత్వ మొండి వైఖరి వీడాలి

Jan 5,2024 17:21 #Bapatla District
anganwadi workers strike 25th day bapatla
  • కారంచేడులో దున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు

ప్రజాశక్తి-కారంచేడు : ప్రభుత్వం కంటే దున్నపోతు నయం నయం ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కనీస వేతనాలు ఇవ్వాలని కారంచేడు లో అంగన్వాడీలు దున్నపోతుకు అర్జీ ఇచ్చారు. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా  శుక్రవారం నాడు కారంచేడు తాసిల్దార్ కార్యాలయం వద్ద 25వ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుతూ దున్నపోతుకు అర్జీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆరు నూరైనా ప్రభుత్వం జీతాలు పెంచేంతవరకు తమ ఆందోళన వీడేది లేదని అన్నారు. గతంలో కూడా 50 రోజులు 70 రోజులు సమ్మె చేసిన ఉద్యోగులు ఎవరు సస్పెండ్ కాలేదని సమ్మె హక్కు కార్మికుల హక్కుని చట్ట ప్రకారం 15 రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామని సంవత్సర కాలంగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని జీతాలు పెంచాలని అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోని స్థితిలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. అనేక ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాల మద్దతు తమ సమ్మెకు ఉందని సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ఆందోళన కొనసాగుతుందని రేఖ చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈ కొండయ్య ఇంకొల్లు ప్రాజెక్టు అధ్యక్షురాలు హైమావతి, మండల అంగన్వాడి నాయకులు అనిత, క్రీస్తు రాజ్యం, శివ లీల, కళ్యాణి, హఫీజ, శ్రీదేవి, జ్యోతి, కృష్ణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️