చిరుధాన్యాలపై అవగాహన సదస్సు

ప్రజాశక్తి – వేమూరు
మండలంలోని వరాహపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగులో యాజమాన్య పద్ధతులపై రైతులకు శుక్రవారం శిక్షణ నిర్వహించారు. బాపట్ల ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ బాల మురళీధర్ నాయక్ రైతులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. చిరుధాన్యాలు మనిషి ఆహార అలవాటులో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉందన్నారు. శాస్త్రవేత్తలు జె రాధాకృష్ణ, ఎం ఉషారాణి రైతులకు చిరుధాన్యాల సాగులో వినియోగించాల్సిన ఎరువులు, పురుగు మందులపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. వాటిని ప్రతి ఒక్కరు గుర్తించి సాగు చేయడమే కాక వాటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డిఆర్సి, డిటిసి, డిఏలు, విజయ నిర్మల పాల్గొని రైతులకు చిరుధాన్యాల సాగుపై మెలుకువలు వివరించారు. కార్యక్రమంలో ఎఒ సిహెచ్ సునీత, సర్పంచి ఎల్లమాటి స్వాతి, విఎఎ దీప్తి, రైతులు పాల్గొన్నారు.

➡️