ఐపిఎస్‌ సాధంచిన రాహుల్‌కు సత్కారం

Apr 19,2024 00:45 ##ips #addanki

ప్రజాశక్తి – అద్దంకి
పట్టణంలోని శ్రీనగర్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు జగన్నాథం బాబురావు, ప్రభావతి దంపతుల కుమారుడు రాహుల్ జగన్నాథం చెన్నై ఐఐటీలో కెమికల్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ లో శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించారని తెలిపారు. తన తల్లి, దండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో తన చిన్న తనం నుండే సివిల్ సర్వీస్‌లో ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేయాలనే కోరికతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత హైదారాబాద్‌లో సివిల్ సర్వీస్ శిక్షణ తీసుకొని తొలి ప్రయత్నంలో సివిల్ సర్వీసులో 873వ ర్యాంకు సాధించినట్లు రాహుల్‌ తెలిపారు. 873వ ర్యాంకు సాధించిన భాష్యం విద్యా సంస్థల పూర్వ విద్యార్థి అయిన రాహుల్ జగన్నాధంను బంగ్లా రోడ్డులోని భాష్యం ఉన్నత పాఠశాల్లో ప్రిన్సిపాల్ జివిఎస్ఆర్‌కె శాస్త్రి ఆధ్వర్యంలో రాహుల్‌ను గురువారం ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభకు జోనల్ ఎడ్యుకేషన్ అధికారి సాయి గణేష్ హాజరయ్యారు. ఐపిఎస్‌ సాధించిన పూర్వ విద్యార్థి రాహుల్‌ను భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ భాష్యం రామకృష్ణ, మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక మెమొంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ అద్దంకి లాంటి చిన్న పట్టణంలో ఈ రాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లి, దండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ తల్లి, దండ్రుల ఆశయం కోసం దేశానికి సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. స్థానిక భాష్యం బ్రాంచిలో 7, 8తరగతులు చదివి తర్వాత గుంటూరు భాష్యం హాస్టల్‌లో 8, 9, 10తరగతలు పూర్తి చేసి, విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన తరువాత చెన్నై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత సివిల్స్ శిక్షణ పొంది తొలి ప్రయత్నంలో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. పరీక్షల్లో తన కంటే మెరుగైన ర్యాంక్ సాధించి సమాజానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లి, దండ్రులు పాల్గొన్నారు.

➡️