బాలల కోసం రాజ్యాంగ పీఠిక

Jan 26,2024 00:03

ప్రజాశక్తి – పంగులూరు
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విద్యార్థులు రాజ్యాంగ పీఠికను తెలుసుకోవాలని, రాజ్యాంగ విభాగాలను బొమ్మల రూపంలో చూపిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేసే పుస్తకం బాలల కోసం రాజ్యాంగ పీఠిక పుస్తకాన్ని గురువారం పంగులూరు, చందలూరు జెడ్‌పి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ పుస్తకాన్ని చదవటం ద్వారా రాజ్యాంగాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగా శ్రీనివాసరావు అన్నారు. గంగవరం బాలల సైన్స్ వేదిక ఈ పుస్తకాన్ని అందిస్తుందని చెప్పారు. బాలల విజ్ఞానాన్ని మరింత పెంపొందించేందుకు కావలసిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయని యుటిఎఫ్ మండల అధ్యక్షులు టివి నరసింహారావు అన్నారు. ఈ పుస్తకాలను 10వ తరగతి విద్యార్థులందరికీ అందజేశారు. కార్యక్రమంలో పంగులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కొప్పోలు రమాదేవి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు డి శాంతి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్ బాబు పాల్గొన్నారు.

➡️