మద్యం బాటిళ్ల ధ్వంసం

Jan 27,2024 23:07

ప్రజాశక్తి – సంతమాగులూరు
గ్రామాల్లో అక్రమంగా లిక్కర్ అమ్మేవారిపై నిఘా పెట్టి కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డిఎస్పి వెంకటేశులు తెలిపారు. మండలంలో 2017నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.90వేల విలువైన 1645 అక్రమ మద్యం సీసాలను పత్తేపురం రోడ్డులో గల పాత పోలీస్ స్టేషన్ వద్ద సిఐ కె నరసింహారావు, ఎస్ఐ శివకుమార్, బల్లికురవ ఎస్ఐ ఉన్నం వేమన ఆధ్వర్యంలో రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎఎస్ఐ చింత హనుమంతరావు పాల్గొన్నారు.

➡️